
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తిరుమల పర్యటనలో ఉన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం జగన్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. ఆ తర్వాత తిరుపతిలో బీజేపీ నేతలు ఏర్పాటుచేసిన ప్రజా ధన్యవాద సభలో పాల్గొనేందుకు రోడ్డు మార్గంలో వెళ్లారు.
మాల్దీవులు, శ్రీలంక పర్యటన ముగించుకుని రేణిగుంటకు వచ్చారు మోడీ. కొలంబోలో ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే వీడ్కోలు పలికారు.