SA20 2026: ఆక్షన్‌లోకి మార్క్రామ్, బ్రెవిస్.. సౌతాఫ్రికా టీ20 రిటైన్ లిస్ట్ రిలీజ్!

SA20 2026: ఆక్షన్‌లోకి మార్క్రామ్, బ్రెవిస్.. సౌతాఫ్రికా టీ20 రిటైన్ లిస్ట్ రిలీజ్!

సౌతాఫ్రికా టీ20 మెగా లీగ్ నాలుగో ఎడిషన్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు ఈ లీగ్ మూడు సీజన్ లు జరిగింది. రెండు సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. 2025 సీజన్ లో ఎంఐ కేప్ టౌన్ తొలిసారి ఛాంపియన్ గా అవతరించింది. బుధవారం (జూలై 23) ఈ లీగ్ 2026 రిటైన్ లిస్ట్ వచ్చేసింది. ఎప్పటిలాగే మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్,జోబర్గ్ సూపర్ కింగ్స్,పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్ టౌన్,డర్బన్ సూపర్ జెయింట్స్,ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్ల జాబితాను ప్రకటించారు.

2025 సీజన్ లో తమ తమ జట్లకు కెప్టెన్లుగా ఉన్న రషీద్ ఖాన్ (MI కేప్ టౌన్), ఫాఫ్ డు ప్లెసిస్ (జోబర్గ్ సూపర్ కింగ్స్), డేవిడ్ మిల్లర్ (పార్ల్ రాయల్స్) మరోసారి ఆయా ఫ్రాంచైజీలు మరోసారి సారధ్య బాధ్యతలు అప్పగించారు. ఒక్కో జట్టుకు కేవలం ఆరు రిటెన్షన్‌ల పరిమితి మాత్రమే ఉంది. రెండుసార్లు సౌతాఫ్రికా 20 విజేత కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ వేలంలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. యాక్షన్ లో తనకు ఎక్కువ ధర లభిస్తుందనే కారణంగా మార్క్రామ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2025 సెప్టెంబర్ 9 న ఆక్షన్ జరగనుంది. క్రిస్మస్ తర్వాత ఈ టోర్నీ ప్రారంభమవుతుంది.   

►ALSO READ | Andre Russell: గార్డ్ ఆఫ్ హానర్‪తో గౌరవం: ఓటమితోనే రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

మార్క్రామ్‌తో పాటు డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, అన్రిచ్ నార్ట్జే, జెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్, లుంగి న్గిడి, వియాన్ ముల్డర్, తబ్రైజ్ షంసీ వంటి స్టార్ ఆటగాళ్లను  అనేక మంది ప్రముఖ దక్షిణాఫ్రికా స్టార్లు కూడా విడుదల చేయడంతో వీరందరూ కూడా మెగా ఆక్షన్ లోకి రానున్నారు. ఐదుగురు లోకల్ స్టార్స్ రూబిన్ హెర్మాన్ (పార్ల్ రాయల్స్), కగిసో రబాడా (ఎంఐ కేప్ టౌన్), డోనోవన్ ఫెర్రీరా (జోబర్గ్ సూపర్ కింగ్స్), హెన్రిచ్ క్లాసెన్ (డర్బన్స్ సూపర్ జెయింట్స్), మార్కో జాన్సెన్ (సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్) ఆయా సంబంధిత ఫ్రాంచైజీలు వైల్డ్‌కార్డ్‌గా ఎంపిక చేసుకున్నాయి. వైల్డ్‌కార్డ్‌గా ఎంపికైన ఏకైక విదేశీ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ (ప్రిటోరియా క్యాపిటల్స్).

   
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2026 కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా:

డర్బన్స్ సూపర్ జెయింట్స్ (మిగిలిన పర్స్: R29.5 మిలియన్లు):
సునీల్ నరైన్*, నూర్ అహ్మద్*, జోస్ బట్లర్*, హెన్రిచ్ క్లాసెన్ (వైల్డ్ కార్డ్)

జోబర్గ్ సూపర్ కింగ్స్ (మిగిలిన పర్స్: R21.5 మిలియన్లు):
ఫాఫ్ డు ప్లెసిస్, జేమ్స్ విన్స్*, అకేల్ హోసేన్*, రిచర్డ్ గ్లీసన్*, డోనోవన్ ఫెరీరా (వైల్డ్‌కార్డ్)

MI కేప్ టౌన్ (మిగిలిన పర్స్: R11.5 మిలియన్లు):
ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, కార్బిన్ బాష్, రషీద్ ఖాన్*, ట్రెంట్ బౌల్ట్*, నికోలస్ పూరన్*, కగిసో రబాడ (వైల్డ్ కార్డ్)

పార్ల్ రాయల్స్ (మిగిలిన పర్స్: R14.5 మిలియన్లు)
లువాన్-డ్రే ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్, బ్జోర్న్ ఫోర్టుయిన్, ముజీబ్ ఉర్ రెహమాన్*, సికందర్ రజా*, రూబిన్ హెర్మాన్ (వైల్డ్ కార్డ్)

ప్రిటోరియా క్యాపిటల్స్ (మిగిలిన పర్స్: R32.5 మిలియన్లు)
విల్ జాక్స్*, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్*, ఆండ్రీ రస్సెల్* (వైల్డ్‌కార్డ్)

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (మిగిలిన పర్స్: R21.5 మిలియన్లు)
ట్రిస్టన్ స్టబ్స్, అల్లా గజన్‌ఫర్*, ఆడమ్ మిల్నే*, జానీ బెయిర్‌స్టో*, మార్కో జాన్సెన్ (వైల్డ్‌కార్డ్)