Boney Kapoor : బోనీ కపూర్ కొత్త లుక్ వైరల్.. జిమ్ లేకుండానే 26 కేజీలు తగ్గి సన్నగా, స్టైలిష్‌గా.!

Boney Kapoor : బోనీ కపూర్ కొత్త లుక్ వైరల్..  జిమ్ లేకుండానే 26 కేజీలు తగ్గి సన్నగా, స్టైలిష్‌గా.!

బాలీవుడ్ సినీ నిర్మాతగా దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసుకుని, ఇటీవల నటుడిగానూ విజయాలు అందుకుంటున్న బోనీ కపూర్(  Boney Kapoor ) ఇప్పడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్నారు . దీనికి కారణం ఆయన సాధించిన అనూహ్యమైన , అద్బుతమైన శారీరక మార్పు.  ఊహించని విధంగా సన్నగా, స్టైలిష్‌గా, యువకుడిలా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.  ఏకంగా 26 కిలోల బరువు ( weight loss )  తగ్గారు. అదికూడా  జిమ్‌కు ఒక్కరోజు కూడా వెళ్లకుండానే. బోనీ కపూర్ కొత్త లుక్ ఇప్పుడు సినీ, ఫ్యాషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది

కొత్త లుక్‌తో నెట్టింట వైరల్
క్యాజువల్ దుస్తుల్లోనూ, సెమీ-ఫార్మల్స్‌లోనూ బోనీ కపూర్ కనిపిస్తున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. సన్నబడిన ఆయన రూపం చూసి అభిమానులు, సినీ ప్రముఖులు "వావ్! ఏంటీ మార్పు, అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం!" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరు ఆయన కొత్త ఫిట్‌నెస్‌కు ఫిదా అవ్వగా, మరికొందరు ఈ భారీ మార్పు వెనుక ఉన్న రహస్యం ఏంటని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఒకానొక దశలో భారీకాయంతో కనిపించిన బోనీ కపూర్, ఇప్పుడు తన వయసు కంటే పదేళ్లు చిన్నవాడిలా కనిపిస్తున్నారు. 

జిమ్ అవసరం లేకుండానే సన్నగా, స్టైలిష్‌గా..
బరువు తగ్గడానికి ఎటువంటి జిమ్, వ్యాయామాలు అవసరం లేదని నిరూపించారు  బోనీ కపూర్. ఇంత బరువు తగ్గడానికి కారణం ఆయన అనుసరించిన కఠినమైన ఆహార నియమాలు,  క్రమశిక్షణ. రాత్రి భోజనాన్ని పూర్తిగా మానేసి, కేవలం తేలికపాటి సూప్‌లను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారని సమాచారం. అల్పాహారంగా కేవలం పండ్ల రసం, జొన్న రొట్టెకే పరిమితమయ్యారు. అలాగే తన రోజువారీ పనుల్లో మరింత చురుకుగా పాల్గొనడం ద్వారా శారీరక శ్రమను పెంచుకోవడం ఆయనకు కలిసొచ్చింది. 

 

శ్రీదేవి మాటలే స్ఫూర్తి
బోనీ కపూర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేయించుకున్నారు.  అయితే, ఈ బరువు తగ్గడానికి, జుట్టు మార్పిడి చేయించుకోవడానికి తన దివంగత భార్య, నటి శ్రీదేవి మాటలే ప్రధాన కారణమని ఆయన ఎమోషనల్ అయ్యారు."నా భార్య శ్రీదేవి నాతో ఎప్పుడూ 'బోనీ, ముందు బరువు తగ్గండి, ఆ తర్వాత జుట్టు మార్పిడి చేయించుకోండి' అని చెప్పేది" అని గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అందుకే మొదట డైట్ స్టార్ట్ చేసి దాదాపు 14 కేజీలు తగ్గాను.  వ్యాయామం చేయడం చాలా కష్టం, అయినా బరువు తగ్గగలిగాను" అని బోనీ కపూర్  వెల్లడించారు.

►ALSO READ | Pawan Kalyan : 'హరి హర వీరమల్లు'కు కన్నడ సెగ.. బ్యానర్ కన్నడలో లేదని చించేశారు !