మిల్లెట్స్​తో ఆహార భద్రత : ప్రధాని మోడీ

మిల్లెట్స్​తో ఆహార భద్రత : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఆహార భద్రతా సవాళ్లను అధిగమించేందుకు, ఆహారపు అలవాట్లను మార్చేందుకు చిరుధాన్యాలు సాయపడుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ ఆహార వ్యవస్థలో పోషక- తృణధాన్యాల వాటాను పెంచేందుకు కృషి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు. శనివారం గ్లోబల్ మిల్లెట్స్ (శ్రీ అన్న) కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మాట్లాడారు. ఇండియా ప్రతిపాదన, ప్రయత్నాల తర్వాత.. 2023ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం దేశ ప్రజలకు గర్వకారణమని అన్నారు. మిల్లెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రపంచ ఉద్యమంగా ప్రోత్సహించడానికి ఇండియా నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, కెమికల్స్, ఫర్టిలైజర్ల అవసరం లేకుండానే మిల్లెట్స్ పంటలు బాగా పండుతాయని చెప్పారు. మన మిల్లెట్ మిషన్.. 2.5 కోట్ల మంది చిన్న రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పోస్టల్ స్టాంప్, రూ.75 కాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రధాని ప్రారంభించారు.