తెలంగాణ ఇచ్చినా జనం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమ్మలే

తెలంగాణ ఇచ్చినా జనం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమ్మలే

న్యూఢిల్లీ:  ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో వరుసగా అధికారాన్ని కోల్పోతున్నా కాంగ్రెస్ పార్టీలో మార్పు రావడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘వాళ్లు తెలంగాణను ఇచ్చారు. కానీ ఆ రాష్ట్ర ప్రజలు వారికి మద్దతు ఇవ్వలేదు. వాళ్లు జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రియేట్ చేశారు. కానీ అక్కడ ఇంతవరకూ సొంతంగా అధికారంలోకి రాలేకపోయారు” అని ఆయన అన్నారు. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంతకుముందు చేసిన కామెంట్లపై కౌంటర్ ఇచ్చారు. కరోనా ప్యాండెమిక్ ను కూడా కాంగ్రెస్ రాజకీయాలకు వాడుకుందని మండిపడ్డారు. బీజేపీ సర్కారు పాలసీలపై కాంగ్రెస్ దాడిని తిప్పికొట్టేందుకు నెహ్రూ మాటలనూ ప్రస్తావించారు.     

నూరేండ్లు పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చేట్లు లేరు.. 
‘‘చాలా రాష్ట్రాలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెళ్లగొట్టాయి. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం ఇంకా 2014లోనే ఉండిపోయారు. కాంగ్రెస్ నాగాలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచి 24 ఏండ్లు, ఒడిశాలో 27 ఏండ్లు అవుతోంది. గోవాలోనూ ఫుల్ మెజారిటీతో గెలిచి 28 ఏండ్లు అయింది. త్రిపురలో 1988లో, బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1972లో చివరిసారిగా గెలిచింది. ప్రజలు ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో ఓడగొడ్తున్నా కాంగ్రెస్ నేతల అహంకారం మాత్రం తగ్గడంలేదు” అని మోడీ అన్నారు. కాంగ్రెస్ నేతలు ఇస్తున్న స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు, లేవనెత్తుతున్న ఇష్యూస్ చూస్తే.. మరో వందేండ్లు అధికారంలోకి రాకూడదని తీర్మానం చేసుకున్నట్లుగా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.  

మైగ్రెంట్లను రెచ్చగొట్టిన్రు 
కరోనా ఫస్ట్ వేవ్ టైంలో డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో సూచనల మేరకు దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడ్నే ఉండాలని లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్ విధిస్తే.. వలస కూలీలు సిటీలను వదిలి వెళ్లాలంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ రెచ్చగొట్టాయని మోడీ ఆరోపించారు. కరోనా సంక్షోభ సమయంలో కాంగ్రెస్ అన్ని లిమిట్స్ క్రాస్ చేసిందన్నారు. వలస కార్మికులను కష్టాల్లోకి నెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పాపాన్ని మూటగట్టుకుందన్నారు. దేశంలో గందరగోళం సృష్టించేందుకు ముంబైలోని వలస కార్మికులకు కాంగ్రెస్ ఫ్రీ టికెట్లు ఇచ్చి మరీ సిటీ నుంచి పంపేసిందన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇలాగే చేసిందన్నారు. 

నెహ్రూ కొరియాపై నెపం నెట్టిండు 
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు కొరియన్ యుద్ధమే కారణమని దేశ మొదటి ప్రధాని జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ చెప్పారని మోడీ అన్నారు. అప్పటి కాంగ్రెస్ పాలనలో ద్రవ్యోల్బణం రెండంకెలు దాటిందన్నారు. బ్రిటీష్ పాలకుల వలెనే కాంగ్రెస్ కూడా విభజించి, పాలించు అనే సూత్రాన్నే ఫాలో అవుతోందని, ఆ పార్టీ డీఎన్ఏలోనే ఈ పాలసీ ఉందని మోడీ అన్నారు. ఇప్పుడు తుక్డే తుక్డే గ్యాంగ్ కు కాంగ్రెస్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిందన్నారు. తమిళుల సెంటిమెట్లు దెబ్బతినేలా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 

వాళ్లే జోక్ గా మారిపోయిన్రు 
కొందరు అపొజిషన్ నాయకులు యువత, బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భయాన్ని వ్యాప్తి చేసి సంతోషం పొందుతున్నారని మోడీ అన్నారు. కొందరు ఇండస్ట్రియలిస్టులు కరోనా వేరియంట్లు అంటూ లోక్ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై కౌంటర్ ఇచ్చారు. ఒక లీడర్ అలాంటి స్టేట్ మెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంపైనా కాంగ్రెస్ నేతలు జోక్ లు వేస్తున్నారని, కానీ నేడు వాళ్లే పెద్ద జోక్ గా మారిపోయారని మోడీ అన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంతో కరప్షన్ కు దారులు మూసుకుపోవడంతో కాంగ్రెస్ వంటి కొన్ని పార్టీలకు బాధ కలుగుతోందన్నారు.  

సింగరేణి జోలికొస్తే ఢిల్లీకి సెగతగుల్తది

ప్రైవేట్ కంపెనీలో స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలి