టీకాల సరఫరాను పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం

టీకాల సరఫరాను పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం

దేశ ప్రజలకు సకాలంలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు ప్రధాని మోడీ. ఇందుకోసం కరోనా టీకాల సరఫరాను పెంచేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నామన్నారు. అన్ని రాష్ట్రాలు టీకాలు వృథా కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అత్యున్నత ప్రమాణాలను పాటిస్తే వ్యాక్సిన్ వృథాను అరికట్టొచ్చని ఆయన సూచించారు. వ్యాక్సిన్ కార్యక్రమాల కోసం మనం చేసే ప్రయత్నాల్లో లోపాలుండకూడదన్నారు మోడీ. 

కరోనా కట్టడిపై అన్ని రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో ఇవాళ(మంగళవారం,మే-18) ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాతో పోరులో అధికారులే ఫీల్డ్ కమాండర్లన్నారు. ఇలాంటి సమయంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు.. భవిష్యత్ లో మరిన్ని క్లిష్టమైన సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయన్నారు.