ఆక్సిజన్ ట్యాంకర్లను ఎక్కడా ఆపొద్దు

ఆక్సిజన్ ట్యాంకర్లను ఎక్కడా ఆపొద్దు
  • ఆక్సిజన్ ట్యాంకర్లను ఎక్కడా ఆపొద్దు
  • సీఎంలకు ప్రధాని మోడీ సూచన
  • ఆక్సిజన్, మందుల సప్లైపై కోఆపరేట్ చేసుకోవాలని సూచన
  • ఒక దేశంగా పని చేస్తే వనరుల కొరత ఉండదని కామెంట్
  • 11 మంది ముఖ్యమంత్రులతో మీటింగ్

న్యూఢిల్లీ: ‘‘కరోనాపై పోరాటంలో రాష్ట్రాలు కలిసి పని చేయాలి. ఫస్ట్ వేవ్​లో ఇండియా సాధించిన విజయానికి అతిపెద్ద ఆధారం మన ఐక్యతే. ఈ సవాలును కూడా అదే విధంగా మనం పరిష్కరించుకోవాలి’’ అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మనమందరం ఒక దేశంగా పని చేస్తే.. వనరుల కొరత అనేదే ఉండదని చెప్పారు. ఈ విషయంలో కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్రాలతో హెల్త్ మినిస్ట్రీ టచ్​లోనే ఉందని, పరిస్థితిని జాగ్రత్తగా మానిటర్ చేస్తోందని, అవసరమైన అన్ని సలహాలు సూచనలు ఇస్తోందని వివరించారు. కరోనా కేసుల పెరుగుదల, ఆక్సిజన్, మెడిసిన్ల కొరత నేపథ్యంలో.. వైరస్ వ్యాప్తి కల్లోలం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సమావేశమయ్యారు.

ఆక్సిజన్ ట్యాంకులు ఆపొద్దు
ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా సమయాన్ని తగ్గించేందుకు ఇండియన్ ఎయిర్​ఫోర్స్, రైల్వేను రంగంలోకి దించినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ‘ప్రతి రాష్ట్రం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎక్కడా ఏ ఒక్క ఆక్సిజన్ ట్యాంకర్​ను కూడా అడ్డుకోకూడదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ట్యాంకర్లు ఎక్కడా చిక్కుకోకూడదు’ అని ఆదేశించారు. రాష్ట్రాల సరిహద్దుల్లో ఆక్సిజన్ ట్యాంకులను నిలిపేస్తున్న క్రమంలో ఈ కామెంట్లు చేశారు. రాష్ట్రాలు కోఆర్డినేషన్​తో పనిచేసి ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆక్సిజన్, మందుల సరఫరా విషయంలోనూ కలిసి పనిచేయాలన్నారు. ఆక్సిజన్, మెడిసిన్ల బ్లాక్ మార్కెటింగ్,  కృత్రిమ కొరత సృష్టించడంపై రాష్ట్రాలు కన్నేసి ఉంచాలని సూచించారు.

హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేయాలి
ఆక్సిజన్ కొరతపై స్పందించిన ప్రధాని.. సప్లై పెంచేం దుకు నిరంతర చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి రాష్ట్రాలు హై లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ ని ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రం ఆక్సిజన్ కేటాయించిన వెంటనే.. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులలో అవసరానికి అనుగుణంగా ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ను సరఫరా చేసేలా ఈ సమన్వయ కమిటీ చర్యలు తీసుకోవాలన్నారు. పేషెంట్లకు ట్రీట్మెంట్​తో పాటు.. హాస్పిటల్​లో సెక్యూరిటీ మెజర్లు కూడా చేపట్టాలన్నారు. ఈ మీటింగ్​లో11 రాష్ట్రాలు, యూటీల సీఎంలు పాల్గొన్నారు. 

సీఎంలు ఏమన్నారంటే..

  • ఆస్పత్రుల్లో ఆక్సిజన్ షార్టేజ్ వల్ల ‘పెద్ద విషాదం’ జరిగే ప్రమాదం ఉందని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. సైన్యం ద్వారా అన్ని ఆక్సిజన్ ప్లాంట్లను కేంద్రం స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
  • ఆక్సిజన్​ను విమానాల ద్వారా సరఫరా చేయాలని, తగినన్ని వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని, రెమ్డెసివిర్ మందును దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కోరారు.
  • 1,471 టన్నుల ఆక్సిజన్, 2 లక్షల డోసుల రెమ్డెసివిర్ సప్లై చేయాలని కర్నాటక సీఎం యెడియూరప్ప కోరారు.
  • 18 ఏళ్లు నిండిన వాళ్లకు వ్యాక్సినేషన్​పై కేంద్రం పాలసీ.. రాష్ట్రాల విషయంలో అన్యాయంగా ఉందని, వ్యాక్సినేషన్​కు కేంద్రమే నిధులివ్వాల ని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్  కోరారు.

మీటింగ్ లైవ్ టెలికాస్ట్.. పీఎం సీరియస్​.. కేజ్రీవాల్​ సారీ
మీటింగ్​లో ప్రధానితో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మాట్లాడుతుండగా.. అదంతా లైవ్ టెలికాస్ట్ అయ్యింది. ఆక్సిజన్ సిలిండ ర్ల కొరతపై కేజ్రీవాల్ మాట్లాడుతుండగా దాన్ని ప్రసారంచేయడం వివాదాస్పద మైంది. కరోనా టైంలో కేజ్రీవాల్ రాజకీ యాలు చేస్తున్నారని కేంద్రం మండిపడిం ది. ఇన్ హౌస్ మీటింగ్​ను టెలికాస్ట్ చేయ డంపై ప్రధాని సీరియస్​ అయ్యారు. దీంతో కేజ్రీవాల్  సారీ చెప్పారు.