
వంద కోట్ల టీకా డోసులు పంపిణీ చేసిన తర్వాత భారత్ కొత్త శక్తితో ముందుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశంలో విజయవంతమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం.. భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటింది అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన మోడీ.. ప్రజలందరికీ టీకా అందించే క్రమంలో దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు ఏ అవకాశాన్ని విడిచి పెట్టలేదని కొనియాడారు. అక్టోబర్ 31న జరగనున్న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు మోడీ. ప్రజలంతా దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా కనీసం ఒక్క పనైనా చేయాలని పిలుపునిచ్చారు.