రాముడి గుడికి రాళ్లెత్తిన కూలీలకు పూలతో మోదీ సత్కారం

రాముడి గుడికి రాళ్లెత్తిన కూలీలకు పూలతో మోదీ సత్కారం

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాల రాముడు కొలువు దీరాడు. యావత్ దేశం ఎన్నో ఏండ్ల కల నెరవేరింది.  ప్రపంచంలోనే అతిపెద్ద హిందూదేవాలయాల్లోనే ఒకటి అయోధ్య. ఈ కట్టడం వెనుక ఎందరో  త్యాగం..మరెందరో కృషి, కార్మికుల కష్టం ఉంది. ఆ కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.  ప్రధాని నరేంద్ర మోదీ బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్య ఆలయ నిర్మాణంలో భాగమైన కార్మికులను సత్కరించడం ఇవాళ హైలెట్ గా నిలిచింది. 

రామమందిరంలో నిర్మాణ సిబ్బందిలో భాగమైన కార్మికులపై ప్రధాని నరేంద్ర మోదీ పూల వర్షం కురిపించారు. గుడి కట్టడానికి ఎంతో కష్టపడ్డ కార్మికులను వరుస క్రమంలో  కుర్చీల్లో కూర్చో బెట్టి ఒక్కొక్కరి నెత్తిపై  మోదీ గులాబీ  పూలు చల్లారు. వందలాది మంది కార్మికులందరిని ఇలా పూలతో  సత్కరించారు. ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది

అంతకుముందు  ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు. ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా మధ్యాహ్నం 12.30గంటలకు  ప్రాణప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.  వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  అదే సమయంలో జై శ్రీరామ్‌ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించి పోయారు. సకలాభరణలతో అలంకరించిన బాలరాముడు ధనస్సు ధరించి.. కమలంపై కొలువుదీరాడు. ఆ దివ్యరూపం చూసిన భక్తులు తన్మయంతో భక్తులు పులకరించిపోతున్నారు.
 
ప్రాణప్రతిష్ట అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ..రామ్​లల్లా ఇక టెంట్​ లో ఉండరు.. గర్భగుడిలో ఉంటారన్నారు.  అయోధ్యకు రాముడొచ్చాటంటూ... దేశంలో రామరాజ్యం వచ్చిందన్నారు. 2024 జనవరి 22 చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని... ఈ రోజు సామాన్యమైన రోజు కాదన్నారు. కాలచక్రంలో ఎప్పటికీ గుర్తుంచుకొనే సమయమన్నారు. వెయ్యేళ్ల తరువాత కూడా ఈ రోజును గుర్తుంచుకుంటారు..సరయూ నదికి... అయోధ్యపురికి నాప్రణామాలు.. రాముడు ఉన్న చోట హనుమంతుడు ఉంటాడు.