తెలంగాణకు మోదీ.. మూడు రోజుల గ్యాప్లో రెండు సార్లు

తెలంగాణకు మోదీ..  మూడు రోజుల గ్యాప్లో రెండు సార్లు

ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. 2023 నవంబర్  7, 11వ తేదీల్లో మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు.  కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నల్గొండ జిల్లాల్లో నిర్వహించే సభల్లో ఆయన పాల్గొననున్నారు.  అభ్యర్థుల నామినేషన్ అనంతరం నవంబర్  19న కూడా  మరోసారి ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి మోదీ రానున్నారు. మోదీతో పాటుగా కేంద్రమంత్రులు కూడా ప్రచారంలో పాల్గొనున్నారు.  

ఇప్పటికే మోదీ, కేంద్ర హోంమంత్రి  అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే.   గత నెలలో తెలంగాణకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన ప్రధాని మోదీ.. ఈ సారి ఏం మాట్లాడనున్నారు అన్నది ఆసక్తికరంగా మారనుంది.  మరోవైపు సీఎం కేసీఆర్ రోజుకు మూడు సభల చొప్పున  ప్రచారం  నిర్వహిస్తున్నారు. 

ALSO READ : రైతుబంధు అనే మాట నా నోట్లో నుంచి వచ్చింది : నిర్మల్ సభలో కేసీఆర్