
ప్రధాని నరేంద్ర మోడీ మే 18, 2023గురువారం రోజున హౌరా, పూరీల మధ్య ప్రయణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోడీ ప్రారంభిస్తారని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పూరీ స్టేషన్‌లో ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ రైలు హౌరా, పూరీల మధ్య 500 కి.మీ దూరాన్ని ఆరున్నర గంటల్లో చేరుకుంటుంది.
ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఉదయం 5:50 గంటలకు బయలుదేరి 11:50 గంటలకు ఒడిశాలోని పూరీకి చేరుకుంటుంది. వందే భారత్ మధ్యాహ్నం 2 గంటలకు పూరిలో బయలుదేరి రాత్రి 7:30 గంటలకు హౌరా చేరుకుంటుంది. ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్ కియోంజర్ రోడ్, భద్రక్, బాలాసోర్, హల్దియా స్టేషన్‌లో ఆగనుంది.
చైర్ కార్ ధర రూ. 1,590 (ఫుడ్ కోసం రూ. 308తో కలిపి), ఎగ్జిక్యూటివ్ తరగతికి రూ. 2,815 (ఫుడ్ కోసం రూ. 369తో కలిపి) ఉండనుంది. ప్రయాణికుడు నో మీల్స్ అని ఎంచుకుంటే టిక్కెట్ ధరలో క్యాటరింగ్ చేర్చబడదు. హౌరా-పూరీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మే20 నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఈ రైలు గురువారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది.