
AI మ్యాజిక్ చేస్తుంది.. మైమరిపిస్తుంది అంటే ఏమో అనుకున్నాం.. ఇప్పటి వరకు చెత్త చెత్తగా.. ఒకరిపై ఒకరు విద్వేషాలతో వీడియోలు చేస్తున్న టైంలో.. ఫస్ట్ టైం ఓ AI వీడియో అందర్నీ ఆకర్షిస్తోంది. ప్రెట్టీ లిటిల్ బేబీ సాంగ్ కు.. మన పార్లమెంట్ లోని రాజకీయ నేతల ఫొటోలను జోడిస్తూ.. అది కూడా చిన్నప్పటి ఫొటోలతో చేసిన AI వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
Pretty little baby ft indian politicians pic.twitter.com/caHpPQk3rk
— Prayag (@theprayagtiwari) May 21, 2025
రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, సోనియా, రాహుల్ గాంధీలు, ఇతర ఇండియన్ పొలిటీషియన్స్ తో ప్రెట్టీ లిటిల్ బేబీస్ అంటూ చేసిన ఈ వీడియో ఎంతో ముచ్చటగా ఉందంటూ.. నెటిజన్లు రీ పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది పొలిటీషియన్స్ తమ తమ సోషల్ అకౌంట్స్ తో దీన్ని షేర్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఎందుకు ఆలస్యం.. మనం కూడా ఆ వీడియో చూసేద్దామా..