బెంగళూరు సబ్ అర్బన్ రైల్వే ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన 

బెంగళూరు సబ్ అర్బన్ రైల్వే ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన 

బెంగళూరు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఎకనామిక్స్ ప్రాంగణంలో డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని  సోమవారం పీఎం మోడీ ఆవిష్కిరించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసేందుకు బెంగళూరు మోడీ సోమవారం బెంగళూరుకు వచ్చారు. ఈ క్రమంలో తొలుత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ... బేస్ యూనిర్సిటీలో నూతన క్యాంపస్ ను ప్రారంభించనున్నారు. అంతకు ముందు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ క్యాంపస్ లో రూ.280 కోట్లతో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ ను మోడీ ప్రారంభించారు. అదేవిధంగా 832 పడకల బాగ్చి పార్థసారథి హాస్పిటల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 15,700 కోట్లతో నిర్మించనున్న బెంగళూరు సబ్ అర్బన్ రైల్వే ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, సీఎం బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఎన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్ గోపాలకృష్ణన్ తదితరులు మోడీ వెంట ఉన్నారు.