వ్యవసాయ రంగాన్ని మిత్రులకు కట్టబెట్టేందుకు మోడీ కుట్ర

V6 Velugu Posted on Feb 13, 2021

జైపూర్: ప్రధాని మోడీ వ్యవసాయ రంగాన్ని తన మిత్రులకు అప్పజెప్పాలని కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజస్థాన్‌‌లో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. మోడీపై విమర్శలకు దిగారు. ‘దేశంలో 40 శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వారిలో అన్నదాతలతోపాటు చిన్న, మధ్యశ్రేణి వ్యాపారులు, ట్రేడర్లు, లేబర్స్ ఉన్నారు. మోడీ అగ్రి రంగాన్ని తన వ్యాపార మిత్రులకు దోచి పెట్టాలని, కట్టబెట్టాలని చూస్తున్నారు. ఇదే కొత్త అగ్రి చట్టాల అసలు ఉద్దేశం’ అని రాహుల్ విమర్శించారు.

Tagged Congress leader Rahul Gandhi, pm modi, capitalists, friends, Agriculture Sector, businessman

Latest Videos

Subscribe Now

More News