బ్లాక్ ఫంగస్ ఓ కొత్త సవాల్.. పిల్లల్ని రక్షించడంపై ఫోకస్

బ్లాక్ ఫంగస్ ఓ కొత్త సవాల్.. పిల్లల్ని రక్షించడంపై ఫోకస్

న్యూఢిల్లీ: ఫ్రంట్ లైన్ వారియర్స్ తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఉద్వేగానికి గురయ్యారు. వారణాసిలోని ఫ్రంట్ లైన్ వారియర్స్ తో వర్చువల్ గా మాట్లాడిన ఆయన.. మరణించిన కొవిడ్ బాధితులకు నివాళులు అర్పించారు. విపత్కర వేళ సేవలను అందిస్తున్నారని కొనియాడారు. చాలా శాతం కరోనా ఫైట్ లో మనం విజయం సాధించామన్నారు. అలాగే బ్లాక్ ఫంగస్ గురించి హెచ్చరించిన మోడీ.. ఇది మరో సవాల్ అంటూ వ్యాఖ్యానించారు. దీని నుంచి పిల్లలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

'బ్లాక్ ఫంగస్ ను ఎదుర్కోవడానికి అవసరమైన జాగ్రత్తల మీద ఫోకస్ పెట్టడం అవసరం. ఎక్కడ వ్యాధి ఉందో, అక్కడ చికిత్స అందించాలన్నారు (జహా భీమార్, వహా ఉపచార్). ఈ భావనతో ప్రజలు తమ నగరాలు, గ్రామాల్లో ఇంటింటికీ మందులు పంపిణీ చేయడానికి కంటైనర్ జోన్‌లను తయారుచేసే పద్ధతి ప్రశంసనీయం. సెకండ్ వేవ్ లో టీకా సురక్షితను చూశాం' అని మోడీ పేర్కొన్నారు.

'వ్యాక్సిన్ భద్రత కారణంగా చాలా వరకు ఫ్రంట్ లైన్ కార్మికులు ప్రజలకు సురక్షితంగా సేవ చేయగలిగారు. ఈ సెక్యూరిటీ గార్డు రాబోయే కాలంలో ప్రతి వ్యక్తికీ చేరుతుంది. మీ వంతు వచ్చినప్పుడు తప్పనిసరిగా టీకా వేసుకోవాలి. గ్రామాల్లో కరోనా పై జరుగుతున్న యుద్ధంలో ఆశా, ఎఎన్‌ఎంలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వారి సామర్థ్యం, అనుభవాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. మీ చిత్తశుద్ధితో అందరి ప్రయత్నాలతో కరోనాను చాలా వరకు అడ్డుకున్నారు. కానీ ఇది సంతృప్తి పడే సమయం కాదు. మనం సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంది. ప్రస్తుతం బెనారస్, పూర్వాంచల్ గ్రామీణ ప్రాంతాలపై చాలా శ్రద్ధ వహించాలి' అని మోడీ సూచించారు.