
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వందే భారత్ రైలు పరుగులుపెట్టడానికి రెడీ అయ్యింది. వందే భారత్ రైలును ప్రారంభించడానికి ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రానున్నారని సమాచారం. కాజీపేట మీదుగా సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఈ వందే భారత్ రైలు నడవనుంది. వీటితో పాటు సికింద్రాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తోంది. అయితే మోడీ పర్యటనపై పీఎంవో అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
హై టెక్నాలజీ హంగులతో వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను దశలవారీగా అన్ని జోన్లలో ప్రవేశపెడుతున్నారు. వందే భారత్ రైలు గంటకు 160 కి.మీ వేగంతో వెళ్లగలదు. రెండు నిమిషాల్లోనే 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కాజీపేట మీదుగా కాగా,రెండోది నల్గొండ మార్గం.