టాలీవుడ్ లో విషాదం.. కోట అస్తమయం.. భావోద్వేగానికి గురైన బ్రహ్మానందం...

టాలీవుడ్ లో విషాదం.. కోట అస్తమయం.. భావోద్వేగానికి గురైన బ్రహ్మానందం...

టాలీవుడ్​ లో విషాదం  నెలకొంది. విలన్​పాత్రలో సినీ ప్రేక్షకులను మెప్పించిన కోట శ్రీనివాసరావు  ఈ రోజు  ( జులై 13)  తెల్లవారుజామున 4గంటలకు కన్నుమూశారు.  ఆయన మరణ వార్త విన్న ప్రముఖులు కోట ఇంటికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పించారు.  కోట పార్థివ దేహాన్ని చూసిన నటుడు బ్రహ్మానందం భావోద్వేగానికి గురయ్యారు.  వారు ఇద్దరూ కలసి రోజుకు 18 గంటలు పనిచేసేవారని .. ఇక కోట లేరనే వార్తను జీర్ణించుకోలేనని కన్నీటి పర్యంతమయ్యారు.  అరే ఒరే అని పిలుచుకునే వాళ్లమని...  నటన ఉన్నత కాలం కోట  సినీ ఇండస్ట్రీలోనే  చిరస్మరణీయంగా ఉంటారని బ్రహ్మానందం తెలిపారు.

కోట శ్రీనివాసరావు అస్తమించారన్న వార్తతో  సిని ఇండస్ట్రీని అంతులేని విషాదంలో మునిగిపోయింది. నటులు రాజేంద్రప్రసాద్​.. తనికెళ్ల భరణి పలువురు అగ్రనేతలు కోట పార్థివదేహానికి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా తనికెళ్ల భరణి.. కోట శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటా... వ్యక్తిగతంగా  దశాబ్దాలకు పైగా పరిచయం ఉందన్నారు.ఆయన వేసిన  ప్రతి వేషం సంపూర్ణ నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చిందని వివరించారు.

కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని  చూస్తూ, ఆరాధిస్తూ.. ఆయన్నుంచి నేర్చుకుంటూ పెరిగానని హీరో రవితేజ అన్నారు. .  ఆయనతో కలిసి పని చేసిన క్షణాలు.. నాకు తీపి జ్ఞాపకాలు... కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని రవితేజ కోట పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.