కోట శ్రీనివాస్ కు మెగాస్టార్ చిరంజీవి నివాళి

కోట శ్రీనివాస్ కు మెగాస్టార్ చిరంజీవి నివాళి

కోట శ్రీనివాస్ రావుకు మెగాస్టార్ చిరంజీవి నివాళి అర్పించారు. కోట భౌతిక కాయాన్ని సందర్శించిన చిరు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోట లెజండరీ యాక్టర్ అని అన్నారు. కోటా,తాను ప్రాణం ఖరీదుతోనే సినీ కెరీర్ మొదలు పెట్టామని చెప్పారు చిరంజీవి.  కోటకు నివాళి అర్పించడానికి  పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి తరలివస్తున్నారు.

కోట మరణం విచారకరం

కోట శ్రీనివాస్ మరణం విచారకరమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇవాళ ఉదయం కోట భౌతిక కాయాన్ని సందర్శించిన ఆయన..కోట  గొప్ప నటుడని  మానవతావాది అని అన్నారు. విలక్షణమైన పాత్రలు పోషించి... ప్రజా అభిమానాన్ని సొంతం చేసుకున్నారని కొనియాడారు.  అయన సినిమాలో కనిపిస్తే హాస్యం పండేది,  అయన కుమారుడి మరణంతో కుంగిపోయారు. కొన్ని ప్రమాణాలు, పద్ధతులు గల నటుడిని  సినిమా రంగం కోల్పోయిందన్నారు.  కోట శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోదైర్యం ఇవ్వాలని కోరారు. 

ముక్కుసూటి మనిషి

కోట మృతిపట్ల సినీ నిర్మాత అల్లు అరవింద్ సంతాపం తెలిపారు. కోట భౌతిక కాయాన్ని సందర్శించిన ఆయన.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. .కోట శ్రీనివాస్ రావుతో   దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. రౌడీ అల్లుడులో కోటా మంచి పాత్ర వేశారని.. కోటా శ్రీనివాస్   నాన్న అల్లు రామలింగయ్యతో చాలా సాన్నిహిత్యంగా ఉండేవారన్నారు. కోట  శ్రీనివాస్ ముక్కు సూటిమనిషి అని అన్నారు అరవింద్.