
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (జూలై 13) రాత్రి రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన లారీ మామిడికాయల లోడ్‌తో రాజంపేట రైల్వేకోడూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
మృతులు మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తించారు పోలీసులు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.