
లష్కర్ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. గంటల తరబడి క్యూలెన్లలో నిలబడి అమ్మవారికి బోనాలు, సాక, ఒడిబియ్యం, తొట్టెలు సమర్పించారు. శివసత్తులు పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, ఒగ్గుడోలు, డప్పు చప్పుళ్లతో సికింద్రాబాద్ ప్రాంతం దద్దరిల్లింది. సీఎం రేవంత్ రెడ్డితోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.