RashmikaMandanna: రష్మిక ‘కాక్‌‌‌‌‌‌‌‌ టైల్‌‌‌‌‌‌‌‌ 2’ లుక్ రివీల్.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫొటోస్

RashmikaMandanna: రష్మిక ‘కాక్‌‌‌‌‌‌‌‌ టైల్‌‌‌‌‌‌‌‌ 2’ లుక్ రివీల్.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫొటోస్

ఓ వైపు సౌత్‌‌‌‌‌‌‌‌లో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లోనూ దూసుకెళుతోంది రష్మిక. ప్రస్తుతం షాహిద్‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా ‘కాక్‌‌‌‌‌‌‌‌ టైల్‌‌‌‌‌‌‌‌ 2’ చిత్రంలో నటిస్తోందామె. ఇందులో రష్మికతో పాటు కృతిసనన్‌‌‌‌‌‌‌‌ మరో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌‌ ఇటలీలో జరుగుతోంది. అక్కడ ఈ ముగ్గురిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన కొన్ని ఫొటోస్‌‌‌‌‌‌‌‌, వీడియోస్‌‌‌‌‌‌‌‌ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. సైఫ్ అలీ ఖాన్, దీపిక పదుకొణె, డయానా పెంటి లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ‘కాక్‌‌‌‌‌‌‌‌ టైల్‌‌‌‌‌‌‌‌’ సినిమాకు ఇది సీక్వెల్.

యానిమల్, ఛావా సినిమాలతో బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో రెండు బడా బ్లాక్‌‌‌‌‌‌‌‌ బస్టర్స్‌‌‌‌‌‌‌‌ అందుకున్న రష్మికకు సల్మాన్‌‌‌‌‌‌‌‌తో కలిసి నటించిన ‘సికిందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ నిరాశ పరిచింది. అయినప్పటికీ ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌ ఖురానాకు జంటగా ఆమె నటించిన ‘థామ’ చిత్రం అక్టోబర్ 21న విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది ‘కాక్ టైల్ 2’ రిలీజ్ కానుంది.

ALSO READ : OGTrailer: ‘ఓజీ’ట్రైలర్ వచ్చేస్తోంది.. పవర్ తుఫానుకి సిద్ధంగా ఉండండి

ప్రస్తుతం రష్మిక తెలుగు, హిందీలోనే కాకుండా.. తమిళంలో కూడా నటిస్తుంది. లారెన్స్ నటిస్తూ, డైరెక్ట్ చేస్తూన్న కాంచన 4లో నటిస్తున్నట్లు టాక్. ఆల్రెడీ ఈ సినిమాలో పూజా హెగ్దే నటిస్తుంది. బుట్టబొమ్మతో పాటు సినిమాలో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్లో రష్మిక మందన్న ఉంటుందని సమాచారం. త్వరలో ఈ విషయంపై లారెన్స్ నుంచి అప్డేట్ రానుంది. ఇక తెలుగులో రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' తో పాటుగా విజయ్ దేవరకొండతో ఓ మూవీ చేస్తుంది.