హైదరాబాద్ లో మళ్ళీ మొదలైన వర్షం... ఈ రాత్రికి కూడా కుండపోత తప్పదా.. ?

హైదరాబాద్ లో మళ్ళీ మొదలైన వర్షం... ఈ రాత్రికి కూడా కుండపోత తప్పదా.. ?

బుధవారం ( సెప్టెంబర్ 17 ) హైదరాబాద్ లో కురిసిన కుండపోత వర్షం మరువక ముందే.. గురువారం ( సెప్టెంబర్ 18 ) సాయంత్రం మళ్ళీ మొదలైంది. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఒక పక్క ఎండగా ఉన్నప్పటికీ వర్షం కురుస్తూ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ వర్షం క్రమంగా సిటీ మొత్తం వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం మొదలైన వర్షం రాత్రికి సిటీ మొత్తానికి  వ్యాపిస్తే ఈ రాత్రి కూడా కుండపోత తప్పదా అన్న జనాల్లో ఆందోళన మొదలైంది.

ఎల్బీ నగర్, వనస్థలిపురం,నాగోల్ పరిసర ప్రాంతాల్లో మొదలైన వర్షం రాత్రికి క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు త్వరగా వెళ్లడం బెటర్ అని సూచిస్తున్నారు వాతావరణ నిపుణులు. ఇదిలా ఉండగా.. బుధవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ లో జనజీవనం స్తంభించింది. 

ALSO READ : హైదరాబాద్లో ఏంటీ కుంభవృష్టి..?

సాయంత్రం 4 గంటల నుంచి శివారుల్లో  వర్షం కురవగా, కోర్ సిటీలో 6.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు  నాన్​స్టాప్ ​వాన కురిసింది. ముషీరాబాద్​లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఈ సీజన్​లో ఇదే అత్యధికమని అధికారులు చెప్తున్నారు.  మెయిన్​రోడ్లు మొదలుకుని ఇంటర్నల్​రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపించాయి. ఫలితంగా గంటల తరబడి ట్రాఫిక్ జామ్​లతో జనం ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల విద్యుత్​సరఫరాలో అంతరాయం ఏర్పడింది. 

భారీ వర్షం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. బల్దియా మేయర్​ గద్వాల విజయలక్ష్మి మాసబ్‌ట్యాంక్, చింతల్​బస్తీ, లోయర్​ట్యాంక్ బండ్​ ప్రాంతాల్లో సహాయక చర్యలు పరిశీలించారు.