అపుడు..కోట మాటలు నన్ను బాధించాయి:పవన్

అపుడు..కోట  మాటలు నన్ను బాధించాయి:పవన్

కోట శ్రీనివాస్ రావు మరణ  వార్త విని బాధ కలిగిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కోట భౌతిక కాయానికి నివాళి అర్పించిన పవన్.. తనకు చాలా ఇష్టమైన వ్యక్తి కోట శ్రీనివాసరావు అని చెప్పారు.  ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమటంగా చెప్పేవారన్నారు.అక్కడమ్మాయి..ఇక్కడబ్బాయి నుంచి  అత్తారింటికి దారేది వరకు కలిసి నటించామన్నారు. అత్తారింటికి దారేది  సినిమాలో నటించినపుడు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అని అడిగితే చనిపోయేంతవరకు నటిస్తానని కోట చెప్పారు. అపుడు ఆయన మాటలు ఎంతో భాదకల్గించాయని పవన్ గుర్తు చేసుకున్నారు.

అంతకుముందు  కోట శ్రీనివాస్ రావుకు మెగాస్టార్ చిరంజీవి నివాళి అర్పించారు. కోట భౌతిక కాయాన్ని సందర్శించిన చిరు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోట లెజండరీ యాక్టర్ అని అన్నారు. కోటా,తాను ప్రాణం ఖరీదుతోనే సినీ కెరీర్ మొదలు పెట్టామని చెప్పారు చిరంజీవి.  కోటకు నివాళి అర్పించడానికి  పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి తరలివస్తున్నారు.