ఇయ్యాల అమెరికాకు మోడీ

V6 Velugu Posted on Sep 22, 2021

  • ప్రెసిడెంట్‌‌ బైడెన్‌‌తో 24న భేటీ..  25న యూఎన్‌‌జీఏలో ప్రసంగం

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం అమెరికా బయలుదేరుతున్నారు. శుక్రవారం అమెరికా ప్రెసిడెంట్‌‌ జో బైడెన్‌‌తో సమావేశం కానున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహా తాలిబాన్ల ఆక్రమణ తరువాత అఫ్గానిస్తాన్‌‌లో పరిస్థితులపై చర్చిస్తారు. వాషింగ్టన్‌‌లో జరిగే క్వాడ్‌‌ సమ్మిట్‌‌లో మోడీ పాల్గొంటారు. 25న న్యూయార్క్‌‌లో జరిగే యునైటెడ్ ​నేషన్స్‌‌ జనరల్‌‌ అసెంబ్లీ (యూఎన్‌‌జీఏ) జనరల్‌‌ డిబేట్‌‌లో మోడీ ప్రసంగిస్తారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌‌ కమలా హ్యారిస్‌‌, యూఎస్‌‌లోని టాప్‌‌ కంపెనీల సీఈవోలతో కూడా ప్రధాని సమావేశమవుతారు. 2019 సెప్టెంబరులో మోడీ చివరిసారి అమెరికాలో పర్యటించారు. అప్పటి అమెరికా ప్రెసిడెంట్‌‌ డొనాల్డ్ ట్రంప్‌‌ హ్యూస్టన్‌‌లో ‘హౌడీ మోడీ’ పేరుతో ఈవెంట్‌‌ కండక్ట్ చేశారు. 

Tagged pm modi, america, India, Joe Biden, UNGA, Modi America Tour

Latest Videos

Subscribe Now

More News