సామాన్యుల కోసం మోడీ శ్రమిస్తున్నారు

V6 Velugu Posted on Feb 13, 2021

న్యూఢిల్లీ: సామాన్య ప్రజానీకమే తమ మిత్రులని, వారి కోసమే ప్రధాని మోడీ శ్రమిస్తున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌‌ను ఆత్మ నిర్భర్ భారత్ అడుగులు వేసేలా రూపొందించామని రాజ్యసభలో నిర్మల తెలిపారు. పెట్టుబడిదారులు, సంపన్నులకు అనుకూలంగా బడ్జెట్ ఉందన్న విపక్షాల ఆరోపణలపై నిర్మల ఫైర్ అయ్యారు. బడ్జెట్‌‌పై అపోజిషన్ పార్టీలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.73 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.

Tagged pm modi, finance minister Nirmala Sitharaman, budget 2021-2022, friends, business man, common people

Latest Videos

Subscribe Now

More News