మూడు వ్యవసాయ చట్టాలు రద్దు.. మోడీ క్షమాపణలు

మూడు వ్యవసాయ చట్టాలు రద్దు.. మోడీ క్షమాపణలు

ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రకటించారు. రైతులు ఆందోళనను విరమించాలని కోరారు. దేశ ప్రజలకు, రైతులకు ఆయన ఈ సందర్భంగా క్షమాపణలు కోరారు.ఈనెలాఖరులో వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటామన్నారు. మనస్ఫూర్తిగా వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నామన్నారు. శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటామన్నారు ప్రధాని. ఆందోళన చేస్తున్న రైతులందరు తమ ఇళ్లకు, పొలాలకు తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కొత్త ప్రారంభంతో ముందుకు వెళ్దామని రైతులను కోరారు మోడీ.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచామన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకుచ్చామన్నారు. రైతు మార్కెట్ల అభివృద్ధి, విస్తరణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. పొలంలో పనిచేసే చిన్న రైతుల కోసం కూడా బీమా సదుపాయం కల్పించామన్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బును జమ చేశామన్నారు. తక్కువ ధరకే విత్తనాలు విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు ప్రధాని.