రాజ‌వంశ ప్ర‌భుత్వాలు యూపీకి న్యాయం చేయ‌లేదు

రాజ‌వంశ ప్ర‌భుత్వాలు యూపీకి న్యాయం చేయ‌లేదు

యుపి ప్రజల అభివృద్ధి భారతదేశ అభివృద్ధికి వేగాన్ని ఇస్తుందన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. యూపీ ప్రజల సామర్థ్యం భారతదేశ ప్రజల సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. కానీ UPలో అనేక దశాబ్దాలుగా, రాజవంశ ఆధారిత ప్రభుత్వాలు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ సామర్థ్యానికి న్యాయం చేయలేద‌న్నారు మోడీ. యూపీలోని బారాబంకిలో ప్రధాన మంత్రి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు యూపీ అభివృద్ధికి మాత్రమే కాకుండా దేశానికి కూడా ఎంతో అవసరమ‌న్నారు. ప్రాంతం పరంగా దేశంలో మొత్తం 7% యుపి కావచ్చు. కానీ జనాభాను పరిశీలిస్తే, యూపీ జ‌నాభా భారతదేశ జనాభాలో 16% పైగా ఉందన్నారు మోడీ. 

పేదలు ఎప్పుడూ తమ పాదాల దగ్గరే ఉండి తమ చుట్టూ తిరుగుతూ ఉండాలని రాజవంశీయులు కోరుకుంటారన్నారు. కానీ త‌మ ప్ర‌భుత్వం మాత్రం పేదల కోసం శ్రద్ధ వహిస్తుంద‌న్నారు. వారి జీవిత సమస్యలను ప‌రిష్క‌రించ‌డానికి కృషి చేస్తున్నామన్నారు అందుకే, ఇవాళ UPలోని పేదలు బీజేపీకి అండగా నిలుస్తున్నారన్నారు ప్ర‌ధాని. అన్ని దశల్లో బీజేపీని ఆశీర్వదిస్తున్నారని చెప్పుకొచ్చారు. 
తాము 'పరివార్ వాలా' కాదన్నారు.  మొత్తం భార‌త‌దేశం త‌మ కుటుంబ‌మ‌న్నారు ప్ర‌ధాని. అన్ని కుటుంబాల బాధను గుర్తించామన్నారు. మొత్తం ఉత్తర ప్రదేశ్ త‌న కుటుంబ‌మ‌న్నారు. ప్ర‌జ‌లంతా త‌న కుటుంబ సభ్యులు అంటూ మోడీ మాట్లాడారు. 

తమకు కుటుంబం ఉందని, కుటుంబాల బాధలు తెలుసని చెప్పుకునే రాజవంశీయులను ముస్లిం కుమార్తెల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్ర‌శ్నించారు ప్ర‌ధాని. గత ప్రభుత్వాలు మన కుమార్తెల అవసరాలు,సమస్యల నుండి కళ్ళు మూసుకున్నాయన్నారు. వాళ్లకు కాస్త సానుభూతి ఉంటే స్కూల్‌కి వెళ్లే మన కూతుళ్లను వేధించే గూండాలకు స్వేచ్ఛ ఇచ్చేవారా? హద్దులు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈరోజు గూండాలకు తెలుస‌న్నారు ప్ర‌ధాని మోడీ.