అమృత హాస్పిటల్ ప్రారంభించిన మోడీ

అమృత హాస్పిటల్ ప్రారంభించిన మోడీ

హర్యానా: ఆధ్యాత్మిక, సామాజిక సంస్థల ద్వారా వైద్య సేవలు అందించడమనేది.... పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ మోడల్ కు ఉదాహరణ అన్నారు ప్రధాని మోడీ. హర్యానాలోని ఫరీదాబాద్ లో అమృత హాస్పిటల్ ను ప్రారంభించారు ప్రధాని మోడీ. కార్యక్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌటాలా పాల్గొన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయలతో 6 వేల కోట్లతో  మాతా అమృతానందమయి మఠం ఆధ్వర్యంలో హాస్పిటల్ నిర్మించారు.

ఈ మోడల్ ద్వారా అట్టడుగు వర్గాల వారికి కూడా సేవలు అందించవచ్చారు. దేశంలో ప్రస్తుతం విద్య, వైద్య వ్యవస్థలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోడీ. పెద్ద రోగం వస్తే ట్రీట్ మెంట్ కోసం పేషెంట్స్ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వస్తుండేదని.. ఇప్పుడు ఆ అవసరంలేదని ప్రధాని మోడీ తెలిపారు. ఈ హాస్పిటల్‌కు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్లు వచ్చి చికిత్స పొందవచ్చు అని చెప్పారు.