వంటనూనెల ఉత్పత్తి పెంపు కోసం 11 వేల కోట్లు

వంటనూనెల ఉత్పత్తి పెంపు కోసం 11 వేల కోట్లు

దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోబోతున్న ఈ తరుణంలో... వచ్చే 25 ఏళ్లలో భారత్ ను ఎక్కడ చూడాలనుకుంటున్నామో... నిర్ణయించుకోవాలన్నారు ప్రధాని మోడీ. 2047లో భారత్ వందో స్వతంత్ర్య వేడుకలు జరుపుకుంటుందని... అప్పటికి దేశం స్థితి ఎలా ఉండాలనేది నిర్ణయించడంలో వ్యవసాయం, రైతులకు మంచి అవకాశం ఉందన్నారు. వంట నూనెల విషయంలో భారత్ ఆత్మనిర్భరత సాధించాలన్నారు. దీనికోసం 11వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు మోడీ చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలోనూ రైతులకు సాయం అందించడం ద్వారా రికార్డ్ స్థాయిలో పంటల ఉత్పత్తి జరిగిందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి 9వ విడత నిధులను మోడీ విడుదల చేశారు.