ప్రధాని నరేంద్రమోడీ.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అక్షయ్ ని, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నాని ఉద్దేశించి మోడీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.
ఇంటర్వ్యూలో సోషల్ మీడియాకు సంబంధించి అడిగిన ప్రశ్న సందర్భంగా.. ప్రధాని మోడీ, అక్షయ్ కుమార్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘రాజకీయాల్లో బిజీగా ఉండే మీరు ట్విటర్ పోస్టులను స్వయంగా గమనిస్తారా..?’ అని అక్షయ్ అడిగిన ప్రశ్నకు మోడీ అవునని బదులిచ్చారు. అంతేకాదు…‘‘ మీ భార్య నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటుంది కదా’’ అంటూ అక్షయ్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నేను మిమ్మల్ని( అక్షయ్),ట్వింకిల్ గారినీ సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటాను అన్నారు. ఆమె నన్ను ఎలా టార్గెట్ చేస్తుందా అన్నవిషయాలను గమనిస్తూ ఉంటాను. ఇంట్లో ఆమె తన కోపాన్నంతా నా మీద చూపిస్తారు కాబట్టి..మీరు ప్రశాంతంగా ఉంటారు కదా’’ అంటూ.. ప్రధాని అక్షయ్ ని అడిగారు. దీంతో అక్షయ్ సమాధానంగా పగలబడి నవ్వేశారు.
అయితే.. ఇంటర్వ్యూ తర్వాత వీడియో వైరల్ గా మారడంతో.. దీనికి ట్వింకిల్ ఖన్నా… ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోడీ కామెంట్స్ ని తాను పాజిటివ్ గా తీసుకుంటానని ఆమె చెప్పారు.నేనంటు ఒకదాన్ని ఉన్ననని ప్రధాని గుర్తించడమే కాదు…ఆయన నన్ను గమనించడం.. నా పనిని గుర్తించడం గొప్ప విషయమే కదా.. అని ట్వింకిల్ ట్వీట్ చేశారు.
#WATCH PM Narendra Modi speaks on Akshay Kumar & Twinkle Khanna pic.twitter.com/r0Y2fCjaK0
— ANI (@ANI) April 24, 2019
I have a rather positive way of looking at this-Not only is the Prime Minister aware that I exist but he actually reads my work ? ? https://t.co/Pkk4tKEVHm
— Twinkle Khanna (@mrsfunnybones) April 24, 2019
