సైనికులతో ప్రధాని దీపావళి సెలెబ్రేషన్స్

సైనికులతో ప్రధాని దీపావళి సెలెబ్రేషన్స్

జమ్మూకశ్మీర్ లోని నౌషెరా సెక్టార్ లో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆర్మీ సైనికులతో కలసి పండగ జరుపుకున్నారు. జవాన్లతో మాట్లాడారు. వారికి స్వీట్స్ తినిపించారు. ఫొటోలు తీసుకున్నారు. సైనికులతో ఇంటరాక్ట్ అయ్యారు. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. సైనికులతో కలసి భారత్ మాతాకీ జై అంటూ నినదించారు. ఆర్మీ వెటరన్స్ తో మాట్లాడారు.

తాను ప్రధానమంత్రిగా రాలేదని.. మీ కుటుంబసభ్యుడిగా వచ్చానంటూ.. సైనికుల్లో ఉత్సాహం నింపారు మోడీ. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ టైమ్ లో నౌషెరాలోని బ్రిగేడ్ పోషించిన పాత్రను ప్రశసించారు. తాను ఫోన్ దగ్గరే కూర్చుని ఎప్పటికప్పుడు సైనికుల క్షేమ సమాచారాలను తెలుసుకున్నానని చెప్పారు. గతంలో ఆయుధాలు, ఇతర పరికరాల కొనుగోలుకు ఏళ్ల తరబడి సమయం పట్టేదని.. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ తో ఆ పరిస్థితి మారిందన్నారు. లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు బోర్డర్ ఏరియాల్లో కనెక్టివిటీ మెరుగుపరిచినట్టు చెప్పారు. రక్షణ రంగంలో మహిళల పాత్ర కొత్త శిఖరాలకు చేరుతోందన్నారు. రక్షణ బడ్జెట్ లో 65శాతం దేశంలోనే ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.

ఇవాళ (శుక్రవారం) ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ వెళ్లనున్నారు మోడీ. కేదార్ పురి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. పునర్నిర్మించిన ఆది శంకరాచార్య సమాధిని సందర్శిస్తారు. ఆది శంకరుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ప్రధాని రాక సందర్భంగా... కేదార్ నాథ్ లో భారీ ఏర్పాట్లు చేశారు.