అన్నివర్గాల అభివృద్ధికి కృషి

అన్నివర్గాల అభివృద్ధికి కృషి

దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు మోడీ. ఇటీవల మెడికల్ ఎడ్యుకేషన్ లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. ఓబీసీ జాబితాలను తయారు చేసుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇచ్చామని తెలిపారు. చిన్న రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు మోడీ. దేశంలోని 70కు పైగా మార్గాల్లో కిసాన్ రైలు నడుస్తోందని తెలిపారు. గత కొన్నేళ్లుగా గ్రామాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు ప్రధాని మోడీ. రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలు గ్రామాలకు అందుతున్నాయని చెప్పారు. ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ద్వారా గ్రామాలకు ఇంటర్నెట్ చేరుతోందని తెలిపారు. డిజిటల్ పారిశ్రామికవేత్తలు ఊర్లలో కూడా తయారవుతున్నారు మోడీ. ఈశాన్య భారతం, హిమాలయ ప్రాంతాలు, జమ్మూ కశ్మీర్ తో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలో పీఎం గతి శక్తి ప్లాన్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఎర్రకోట దగ్గర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, అధికారులు ప్రధానికి స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు మోడీ. అంతకు ముందు రాజ్ ఘాట్ మహాత్ముడికి నివాళులర్పించారు.