ప్రధాని మోడీతో యడియూరప్ప ప్రత్యేక భేటీ..

ప్రధాని మోడీతో యడియూరప్ప ప్రత్యేక భేటీ..

కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప  ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా నిన్న యడియూరప్ప మోడీతో15 నిముషాలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ ఏడాదిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

గత కొన్ని రోజులుగా కర్ణాటక  సీఎం  బసవరాజ్ బొమ్మైని  వివాదాలు చుట్టుముడుతున్నాయి.  ప్రతిపక్షాలు ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం.. బసవరాజ్ బొమ్మై పే సీఎం అంటూ పోస్టర్లు వేయడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యడియూరప్ప మోడీతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో యాడ్యురప్పను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశంముందనే ప్రచారం జరుగుతోంది.