కరోనా ఎఫెక్ట్‌: డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో యోగా డే సెలబ్రేషన్స్‌

V6 Velugu Posted on Jun 06, 2020

  • మోడీ లెహ్‌ టూర్‌‌పై నో క్లారిటీ

న్యూఢిల్లీ: ఏటా జూన్‌ 21న ఘనంగా జరిగే ఇంటర్నేషనల్‌ యోగా డే సెలబ్రేషన్స్‌ ఈసారి డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ ద్వారా జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యోగా సెలబ్రేషన్స్ కోసం లెహ్‌ వెళ్తారా లేదా అనే దానిపై కూడా ఇంకా డిసైడ్‌ అవలేదని ఆయుష్‌ సెక్రటరీ వైద్య రాజేశ్‌ చెప్పారు. ఈ ఏడాది లడఖ్‌లోని లెహ్‌లో జరిగే ఇంటర్నేషనల్‌ యోగా సెలబ్రేషన్స్‌లో ప్రధాని మోడీ పాల్గొంటారని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ మార్చిలో ప్రకటించింది. కాగా.. ఇప్పుడు కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో మోడీ లెహ్‌ వెళ్లే చాన్స్‌ లేదని అన్నారు. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేందుకు వీలుగా ఈసారి డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా యోగా డే సెలబ్రేషన్స్‌ ఉండే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది “ యోగా ఎట్‌ హోమ్‌, యోగా విత్‌ ఫ్యామిలీ”అని అన్నారు. జూన్‌ 21 ఉదయం ఏడు గంటలకు అందరూ వర్చువల్‌గా యోగా సెలబ్రేషన్స్‌లో పాల్గొనాలని చెప్పారు. “ ఆ రోజు జరిగేది చాలా పెద్ద ఈవెంట్‌. కానీ డిజిటల్‌ మాధ్యమాల ద్వారా మాత్రమే జరుగుతుంది” అని రాజేశ్‌ అన్నారు.

Tagged corona, Narendra Modi, Leh, yoga day

Latest Videos

Subscribe Now

More News