
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్ బీ), ఢిల్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు సంఖ్య 350: క్రెడిట్ ఆఫీసర్ 250 , ఇండస్ట్రీ ఆఫీసర్ 75, మేనేజర్(ఐటీ) 5, సీనియర్ మేనేజర్(ఐటీ) 5, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5, మేనేజర్ డేటా సైంటిస్ట్ 3, సీనియర్ మేనేజర్(డేటా సైంటిస్ట్) 2.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, సీఏ, ఐసీడబ్ల్యూ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 21 ఏండ్ల నుంచి 28 ఏండ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.50. లాస్ట్ డేట్మార్చి 24.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా.
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు మార్చి 25వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య 9: అసిస్టెంట్ 6, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్(మెకానికల్) 1, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్) 1, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్(ఐటీ)1.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. మార్చి 25 నాటికి 35 ఏండ్లు నిండి ఉండాలి.
అప్లికేషన్: ఆన్ లైన్.
లాస్ట్ డేట్: మార్చి 25.