
లింగంపేట, వెలుగు: 2023 యాసంగి సీజన్ పంటల సాగుకోసం నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ఆయకట్టుకు గురువారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు నీటిని విడుదల చేయనున్నట్లు ఎల్లారెడ్డి డివిజన్ ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ వెంకటేశ్వర్లు ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని 'బీ'జోన్ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారని ఆయన చెప్పారు.