తెలంగాణ దేశానికి అన్నపూర్ణ రైతుల శ్రేయస్సు కోసమే కేసీఆర్ తపన: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ దేశానికి అన్నపూర్ణ రైతుల శ్రేయస్సు కోసమే  కేసీఆర్ తపన:    స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

కోటగిరి, వెలుగు: దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిజాంసాగర్ నుంచి వదిలిన సాగునీటి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 28 ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయకట్టు రైతులతో మాట్లాడి నీటి సరఫరాపై ఆరాతీశారు. చివరి ఆయకట్టు వరకు నీరందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్పీకర్​మాట్లాడుతూ.. నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ చరిత్రలోనే తొలిసారిగా జూన్‌లో నీళ్లు వదిలినట్లు పేర్కొన్నారు.

ALSO READ:దేశంలో ఉల్లి కాదు.. టమాటా కన్నీళ్లు.. కిలో రూ. వంద దాటి పరుగులు

రైతుల శ్రేయస్సు కోసమే సీఎం కేసీఆర్ ఎప్పడూ పరితపిస్తారని అన్నారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్ ను వెనక్కి నెట్టి నెంబర్​వన్​గా నిలిచిందన్నారు. జడ్పీ కో ఆప్షన్ మెంబర్ సిరాజ్, కిశోర్ బాబు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ తదితరులు ఆయనతో ఉన్నారు.