
- తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం
వర్ని, వెలుగు : జోగిని వ్యవస్థ నిర్మూలనకు హేమలత లవణం దంపతులు ఎంతో కృషి చేశారని వారి చేసిన సేవలను మరువలేమని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రుద్రూర్ మండలం అక్బర్‌నగర్ లోని ప్రకృతి చికిత్సాలయం లో ప్రముఖ సంఘసంస్కర్తలు హేమలత లవణం దంపతుల విగ్రహాలను గురువారం అగ్రో ఇండస్ర్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, ఉమ్మడి రాష్ట్ర హస్తకళల మాజీ చైర్మన్ అమర్‌నాథ్‌బాబుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రకృతి చికిత్సాలయం ఒక దేవాలయమన్నారు.
వైద్యం కోసం ఎంతోమంది వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి రోగాలు నయం కాకపోవడంతో అదే ప్రకృతి ఆశ్రమంలో చేరిన రోగులకు తక్కువ ఖర్చుతో సిబ్బంది వైద్యం చేస్తున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సురేశ్ బాబా, తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీఓ భీంరావ్, రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట అరుణ్, రుద్రూర్ విండో చైర్మన్ సంజీవ్‌రెడ్డి, విండో మాజీ చైర్మన్ పత్తిరాము, సంజీవ్, తోట సంగయ్య, షేక్‌ఖాదర్, రామాగౌడ్తదితరులు పాల్గొన్నారు.