Poco x5 : అమెజాన్లో పోకో ఎక్స్ సిరీస్

Poco x5 : అమెజాన్లో పోకో ఎక్స్ సిరీస్

రెడ్ మీ సబ్ బ్రాండ్ పోకో.. ఇండియా మార్కెట్ కోసం నెక్స్ట్ జనరేషన్ ఎక్స్ సిరీస్ ఫోన్ తీసుకువస్తోంది. పొకో ఎక్స్ 5 ప్రో పేరుతో ఈ ఫోన్ ను ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఫోన్ కు సంబంధించిన పోస్టర్, ఇతర వివరాల్ని అమెజాన్ లో వెల్లడించారు. ‘ఆర్ యూ రెడీ టూ అన్ లీష్ ది రెబర్’ ట్యాగ్ లైన్ లో మొబైల్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.  

అయితే ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ను మాత్రం కంపెనీ బయటపెట్టలేదు. గతేడాది లాంచ్ చేసిన రెడ్ మీ నోట్ 11 ప్రో+ ఫోన్ స్పెసిఫికేషన్స్ తోనే పోకో ఎక్స్4  ప్రోను తీసుకురావచ్చని మార్కెట్ వర్గాలు అంచానా వేస్తున్నాయి. ఇటీవలే లాంఛ్ చేసిన రెడ్ మీ నోట్ 12 ప్రో సిరీస్ స్పెసిఫికేషన్స్ తో పోకో ఎక్స్ 5 మొబైల్  రావొచ్చని టాక్ వినిపిస్తోంది.