పోక్సో కేసులో నిందితుడికి .. ఐదేండ్ల శిక్ష, రూ.12వేల ఫైన్

పోక్సో కేసులో నిందితుడికి .. ఐదేండ్ల శిక్ష, రూ.12వేల ఫైన్

సికింద్రాబాద్, వెలుగు : బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి నాంపల్లి సెషన్స్​ కోర్టు ఐదేండ్ల  జైలు శిక్ష, రూ.12వేల ఫైన్ విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. గోపాలపురం పీఎస్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  పార్శిగుట్ట పరిధి వినోభానగర్​ ఫ్రెండ్ కాలనీలో ఉండే ఓ బాలిక 2021లో టెన్త్ పూర్తి చేసింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేక చదువు మానేసి జాబ్  చేసేందుకు నిర్ణయించుకుంది.

తనకు తెలిసిన వారి సాయంతో సికింద్రాబాద్​ వైఎంసీఏ సమీపంలోని ఇండియన్ క్రిస్టియన్ మ్యాట్రిమోని సెంటర్ లో చేరింది. కంప్యూటర్​శిక్షణలో భాగంగా ఆఫీసులో పనిచేసే మల్కాజిగిరికి చెందిన సూపర్​వైజర్ తగరకుంట సురేశ్(46) ఆమెపై లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. దీంతో జరిగిన విషయం బాధితురాలు తల్లిదండ్రులు తెలిపింది. గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కోర్టుకు అందజేయగా విచారణలో భాగంగా జడ్జి పై విధంగా తీర్పు చెప్పారు.