మెహిదీపట్నం, వెలుగు: పోక్సో కేసులో కానిస్టేబుల్ రిమాండ్ కు తరలించిన ఘటన హాబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ రాంబాబు తెలిపిన ప్రకారం.. అఫ్జల్ సాగర్ డి క్లాస్ ప్రాంతానికి చెందిన కె.శంకర్ కొడుకు కె. గోపీనాథ్ (30) ఛత్రినాక పీఎస్ లో కానిస్టేబుల్. గతనెల 30న టెన్త్ విద్యార్థి(16)ని పరీక్ష రాసిన అనంతరం అతను ఆమెను బయటికు తీసుకెళ్లాడు.
అనంతరం ఇంటి వద్ద వదిలిపెట్టాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసి గురువారం కానిస్టేబుల్ గోపీనాథ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.