మనువాదం, ఫాసిజం దేశాన్ని ఏలుతున్నాయ్​ : వెంకన్న

మనువాదం, ఫాసిజం దేశాన్ని ఏలుతున్నాయ్​ : వెంకన్న

మనువాదం, ఫాసిజం దేశాన్ని ఏలుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న అన్నారు. మతం, మనువాదం పేరుతో బడుగువర్గాలను విడదీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దళితులు, పీడిత ప్రజలు ఏకం కావాల్సిన అవసరముందన్నారు. 

కవితలు అనేవి హృదయ సంబంధమైనవని వెంకన్న చెప్పారు. కవిత్వానికి, కులం, మతంతో సంబంధం ఉండదన్నారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే కవిత్వం ఉద్దేశమని తెలిపారు. దళితులు, గిరిజనులు లేకుండా తెలంగాణలో ఉద్యమాలే లేవని వ్యాఖ్యానించారు. ప్రపంచాభివృద్ది, సామాజిక మార్పు కోసం కవులు తమ రచనల ద్వార ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఆధిపత్య భావజాలాన్ని ధ్వంసం చేసేది సాహిత్యమేనని అన్నారు.