తెలంగాణ విలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో..

తెలంగాణ విలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో..

నేత్ర, శ్రేయస్ బట్టోజు, సుధీర్ శర్మ, సాయి రాఘవేంద్ర, ప్రద్యుమ్న లీడ్ రోల్స్‌‌లో మహేష్ గంగిమళ్ల  రూపొందిస్తోన్న చిత్రం ‘పొక్కిలి’.  గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్నారు. రీసెంట్‌‌గా ఈ మూవీ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేసిన దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ‘ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తుంది. 

టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్‌‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాలకేయ ప్రభాకర్ డిఫరెంట్ క్యారెక్టర్‌‌‌‌లో కనిపించనున్నాడని, క్లైమాక్స్, రెండు సాంగ్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందని దర్శక నిర్మాతలు చెప్పారు.