బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష.. మహబూబాబాద్ పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జిమెంట్

బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష.. మహబూబాబాద్ పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జిమెంట్

మరిపెడ, వెలుగు: బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మహబూబాబాద్ పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి అబ్దుల్ రఫీ తీర్పునిచ్చారు. మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ధర్మారం తండాకు చెందిన ధర్మసోత్ రాజేశ్​ను దోషిగా నిర్ధారించిన కోర్టు, యావజ్జీవ శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది. ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి పకడ్బందీగా సాక్ష్యాలు సమర్పించడంలో అప్పటి దర్యాప్తు అధికారి సీఐ సాగర్​, కోర్టు లైజన్ అధికారి ఎస్సై జీనత్, బ్రీఫింగ్ అధికారి సీఐ రాజ్‌‌‌‌కుమార్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య బలమైన వాదనలతో నిందితుడికి శిక్ష పడేలా చేశారు.