సెంట్రింగ్ ​డబ్బాలు ఎత్తుకెళ్తున్న ముఠా అరెస్ట్

సెంట్రింగ్ ​డబ్బాలు ఎత్తుకెళ్తున్న  ముఠా అరెస్ట్
  • 255 సెంట్రింగ్ డబ్బాలు,  రూ.99 వేల నగదు పట్టివేత

కౌడిపల్లి, వెలుగు: సెంట్రింగ్ డబ్బాలు చోరీ చేసిన 10 మంది యువకులను, వాటిని కొనుగోలు చేసిన వ్యాపారిని అరెస్ట్​ చేసినట్టు ఎస్పీ బాలస్వామి తెలిపారు. శనివారం కౌడిపల్లి పీఎస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.  కొల్చారం, కౌడిపల్లి, శంకరంపేట మండలాల్లో 15 రోజుల నుంచి సెంట్రింగ్ డబ్బాలు చోరీ అవుతున్నాయని పీఎస్​లో 5 కేసులు నమోదయ్యాయన్నారు. 

విచారణ చేపట్టిన పోలీసులు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పల్పనూరు వద్ద మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన నారాయనోళ్ల నింగప్ప కు చెందిన స్క్రాప్ దుకాణంలో 255 సెంట్రింగ్ డబ్బాలు గుర్తించారన్నారు.  ఈ మేరకు అతడిని విచారించడంతో శివ్వంపేటకు చెందిన మక్కాని నవీన్, సంపంగి విజయ్​, మక్కాని పవన్​, వడ్డే శ్రీకాంత్​, కొల్చారం మండలం రంగంపేటకు చెందిన   ద్యారంగుల అనిల్, వడ్డే యాదయ్య,  వడ్డే దుర్గ ప్రసాద్,  శ్రీనివాస్, కౌడిపల్లి మండలం నాగ్సాన్​పల్లికి చెందిన  వాదిల దుర్గ ప్రసాద్, అల్లాదుర్గంకు చెందిన దండుగుల ప్రవీణ్  ముఠాగా ఏర్పడి సెంట్రింగ్​ బాక్స్​ లు దొంగతనం చేస్తున్నట్టు తేలిందన్నారు. ఈ దొంగల ముఠా 225 సెట్రింగ్​ బాక్స్​లు చోరీ చేయగా, వాటి విలువ రూ. 2.30 లక్షలు ఉంటుందని చెప్పారు. వాటితోపాటు రూ.99 వేల నగదు కూడా దొంగలించారని పేర్కొన్నారు.