ప్రధానికి బెదిరింపు ఈమెయిల్..యూపీలో బాలుడి అరెస్ట్​  

ప్రధానికి బెదిరింపు ఈమెయిల్..యూపీలో బాలుడి అరెస్ట్​  

లక్నో : ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగిని చంపేస్తానని బెదిరింపు మెయిల్ పంపిన మైనర్ బాలుడి(16)ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రధానిని, యూపీ సీఎం యోగిని చంపేస్తానని న్యూస్ చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇటీవల ఓ బెదిరింపు మెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. చానల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 5న సెక్టార్ 20 పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్ రిజిస్టర్ చేశామని చెప్పారు. సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్​తో పాటు మూడు పోలీసు బృందాలతో కేసు దర్యాప్తు చేపట్టామని వివరించారు.

ఐపీ అడ్రెస్ ఆధారంగా ట్రాక్ చేసి లక్నోలోని చిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాట్ ప్రాంతంలో నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడు బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన11వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడని పోలీసులు వెల్లడించారు. అతను గతంలో  కూడా ప్రముఖులకు ఇలాంటి బెదిరింపు మెసేజ్ లు పంపినట్లు విచారణలో  తేలిందన్నారు. బాలుడిపై కేసు నమోదు చేసి జువైనల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.