పోచారం నివాసం దగ్గర రచ్చ చేసిన బీఆర్ఎస్ నేతలు.. రిమాండ్ కు తరలించనున్న పోలీసులు..

పోచారం నివాసం దగ్గర రచ్చ చేసిన బీఆర్ఎస్ నేతలు.. రిమాండ్ కు తరలించనున్న పోలీసులు..

మాజీ మంత్రి , MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర బీఆర్ఎస్ నేతలు చేసిన హంగామా వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది. దీంతో పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు. మీడియాలో రికార్డ్ అయిన విజువల్స్ , సీసీ పుటేజ్ ను  పరిశీలించారు డీసీపీ విజయ్ కుమార్, సీఎం CSO గుమ్మి చక్రవర్తి. డ్యూటీ లో ఉన్నవారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఇప్పటికే BRSకు చెందిన కొంతమందిని అరెస్ట్ చేసి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.అరెస్టైన వారిలో బాల్క సుమన్, మన్నే గోవర్ధన్, దూదిమెట్ల బాలరాజు,గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. వీరిపై 353, 448 రెడ్ విత్ 34ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు.