ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ ఆరుగురు ఐటీ ఉద్యోగులు అరెస్ట్

ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ ఆరుగురు ఐటీ ఉద్యోగులు అరెస్ట్
  • ఎల్​ఎస్​డీ బ్లట్స్​, హాష్​ ఆయిల్, ఫారిన్ లిక్కర్ సీజ్

చేవెళ్ల, వెలుగు: పార్టీల పేరుతో పలువురు ఐటీ ఉద్యోగులు పెడదోవ పడుతున్నారు. లక్షల్లో జీతాలు ఉండడంతో ఖరీదైన లిక్కర్​తోపాటు విదేశాల నుంచి డ్రగ్స్​తెప్పించుకొని విచ్చలవిడిగా ఎంజాయ్​చేస్తున్నారు. ఇందుకోసం సిటీ శివారులోని ఫామ్​హౌస్​లను ఎంచుకొని చిందులు తొక్కుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లో ఆరుగురు ఐటీ ఉద్యోగులు డ్రగ్స్ తో పట్టుబడడం కలకలం సృష్టించింది. వీరంతా ప్రముఖ ఐటీ సంస్థకు చెందినవారే కావడం గమనార్హం. హైదరాబాద్​కు చెందిన ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ తన బర్త్ డే పార్టీ కోసం శనివారం రాత్రి మొయినాబాద్ మండలం మేడిపల్లి పరిధిలోని సెరీనా ఆర్కుడ్ ఫామ్ హౌస్​ను బుక్​ చేశాడు. 

తొటీ ఉద్యోగులను పార్టీకి పిలిచి, ఫారిన్ లిక్కర్​తో డ్రగ్స్ అరెంజ్ చేశాడు. వీరంతా ఆట, పాటలతో ఎంజాయ్ చేస్తుండగా, ఎక్సైజ్ శాఖ, స్టేట్ టాస్క్ ఫోర్స్​సమాచారంతో చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ సభ్యులు దాడి చేశారు. అభిజిత్ బెనర్జీతో పాటు తోటి స్నేహితులు  సమ్​సన్, పార్థు, గోయల్, యశ్వంత్, సివోడెనిస్​ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 0.05 గ్రాముల ఎల్ఎస్​డీ  బ్లట్స్, 20.21 గ్రాముల హాష్ ఆయిల్, 5 ఫారిన్ లిక్కర్ బాటిళ్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ పరీక్షలో అందరూ డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ ఆపరేషన్​ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం అభినందించారు.