ఈ దరిద్రులు ఎవరు.. కేకులు కూడా కల్తీ చేస్తున్నారు

ఈ దరిద్రులు ఎవరు.. కేకులు కూడా కల్తీ చేస్తున్నారు
  • రాజస్థాన్​ నుంచి అక్రమంగా పాల పొడి రవాణా
  • ప్రమాదకర రసాయనాలతో కేకులు, స్వీట్ల తయారీ

సర్వం కల్తీమయమవుతున్నా ఈ రోజుల్లో కొన్ని పదార్థాలైనా కల్తీ లేకుండా చేస్తారనే నమ్మకం ఉండేది. కొందరు అక్రమార్కులు ధనార్జన కోసం అడ్డదారులు తొక్కుతూ.. కేక్​లు, స్వీట్లను సైతం కల్తీ చేస్తున్నారు. అలాంటి సంఘటనలే హైదరాబాద్​లో వెలుగు చూశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లి నిజాంపేటలోని బాలాజీ కేక్​ ఫ్యాక్టరీలో కల్తీ కేక్​లు తయారీ చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారంతో ఎస్​ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. రసాయన రంగులు వాడుతూ.. అపరిశుభ్ర వాతావరణంలో కేకులు తయారు చేస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు నిందితుడు సయ్యద్​ వాసిఫ్​ని అదుపులోకి తీసుకున్నారు. ఓనర్​ గోపాల కృష్ణ పరారీలో ఉన్నట్లు చెప్పారు. 

మరో చోట స్వీట్లు..

పాతబస్తీ మొఘల్​పురా పోలీస్​స్టేషన్​ పరిధిలోని లాల్​ దర్వాజలోని ఓ ఇంట్లో కల్తీ పదార్థాలతో కలాకండ్​, కోవా తదితర స్వీట్లను తయారు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సౌత్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు ఆ ముఠా సభ్యులను అరెస్ట్​ చేశారు. రాజస్థాన్​ ప్రభుత్వం బాల్​ గోపాల్​యోజన కింద అందిస్తున్న పాల పొడిని తెలంగాణకి అక్రమంగాకి తరలించి వీటిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.