
ఈ దొంగల రూటే సపరేట్..ఏది పడితే అది దొంగతనం చేయరు..ఒక మోడల్ కు చెందిన కార్లలోని సైలెన్సర్లను మాత్రమే దొంగలిస్తారు. అదేంటీ సైలెన్సర్లను ఎత్తుకెళ్తే ఏమొస్తది అనుకోకండీ..ఇక్కడే అసలు కిటుకు ఉంది. ఆ సైలెన్సర్లలో ప్లాటినం, రోడియం, పలాడియం వంటి మెటల్స్ ఉంటాయట. వాటి ధర సుమారు 90వేలు ఉండడంతో ఈ దొంగలు దీనిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో ఒక వ్యక్తి మెకానిక్. అయితే మారుతి ఎకో కార్లలో ఉండే సైలెన్సర్లలో ప్లాటినం, రోడియం, పలాడియం ఉంటుందని.. వాటి విలువ 90వేలు ఉంటుందని అతడు తెలుసుకున్నాడు. దీంతో నిజామాబాద్ సహా పలు ప్రాంతాల్లో మారుతి ఎకో కార్లలో సైలెన్సర్లను దొంగలించడం స్టార్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ కారు సైలెన్సర్ దొంగతనంపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..నిందితులు కారులో వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 5లక్షల 50వేల విలువైన 12సైలెన్సర్లతోపాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు.